*స్కూళ్ళు ఎన్నిరకాలుగా ఉన్నాయిి........*
*ఎన్నియాజమన్యాల కింద ఉన్నాయి,*
*ఏ సిలబస్ అనుసరిస్తున్నాయి, ఎవరికి విద్యనందిస్తున్నాయి వంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు ఈ కింది అంశాలు గోచరించాయి.....*
*1. MPP స్కూళ్ళు:* అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే లక్ష్యంతో ఏర్పడిన మండల పరిషత్ స్కూళ్లు ఉన్నాయి. మనదేశంలో ఇవి 1927 నుండి ఉన్నాయి. ఇవి ఒకటి నుండి ఐదవ తరగతి వరకు ఉంటాయి.
*2. ZP స్కూళ్ళు:* జిల్లా పరిషత్ స్కూళ్ళలో 6-10 తరగతులు ఉంటాయి.ఇలాంటి స్థానిక సంస్థల స్కూళ్ళు 1917 నుండి ఉన్నాయి.
*3. GHS:* స్కూళ్ళు: పూర్తిగా ప్రభుత్వ స్కూళ్ళు.
*4. *ఆంధ్ర ప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్*
రకరకాలైన గురుకులాలన్నికలిపి 974 ఉన్నాయి. కొన్నింటిలో ఇంటర్ విద్య కూడా ఉంది.
5. AP మోడల్ స్కూళ్ళు: వెనుకబడిన మండలాలలో ఇంగ్లిష్ మీడియం విద్య అందించేందుకు ప్రభుత్వం ఈ స్కూళ్ళు స్థాపించింది. ఇందులో 6-12 తరగతులు ఉంటాయి.
6. సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళు(APWREI): వీటిని 1984 లోనే స్థాపించారు. 268 స్కూళ్ళు పేద పిల్లలకు ముఖ్యంగా షెడ్యూలు కులాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉద్దేశించినవి.
7. ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్(APTWREIS). ఇవి గిరిజన సంక్షేమ హాస్టళ్ళు.మొత్తం 187 ఉన్నాయి.
8. మహాత్మా జ్యోతిభా ఫూలే స్కూళ్ళు((MJPTBCWREI): వెనుకబడిన తరగతుల కుటుంబాల పిల్లల కోసం తెలంగాణలో 142 స్కూళ్ళు,ఏర్పాటు చేశారు.ఇందులో అయిదు నుండి పదవ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తారు. 19 జూనియర్ కాలేజిలు ఒక డిగ్రీ కాలేజి కూడా వీటి అధ్వర్యంలో నడుస్తున్నాయి.
9. ఏకలవ్య మోడల్ రెసిడేన్షియల్ స్కూళ్ళు(APTWREIS): రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో 16 స్కూళ్ళు మంజూరు చేశారు.
10. ఆశ్రమ పాటశాలలు: ట్రైబల్ సబ్ ప్లాన్ ప్రాంతాలలో గిరిజన సంక్షేమ శాఖ వీటిని నడిపిస్తుంది.
11. కస్తుర్బా స్కూళ్ళు(KGBV): కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయాలు. భారత ప్రభుత్వం బాలికలకు12 వ తరగతి వరకు రెసిడేన్షియల్ విద్యను అందించేందుకు 2004 లో ప్రారంబించింది.75శాతం సీట్లు SC,ST,BC,Minority కుటుంబాల పిల్లలకు మిగతా 25 శాతం సెట్లు BPL కుటుంబాల పిల్లలకు కేటాయిస్తారు.
12. నవోదయ స్కూళ్ళు: జవహర్ నవోదయ స్కూళ్ళు భారత ప్రభుత్వం మానవ వనరుల శాఖ అధ్వర్యంలో నడుస్తాయి.1986 లో CBSE సిలబస్ తో 6-12 తరగతులు చదివే తెలివైన గ్రామీణ పిల్లలకు కోసం వీటిని ప్రారంబించారు.తమిళనాడు మినహా దేశంలోని ప్రతి జిల్లాలో ఉండేలా 636 స్కూళ్ళు స్థాపించారు.
13. సైనిక్ స్కూళ్ళు: 1961లో రక్షణ శాఖ అధ్వర్యంలో నడుస్తాయి.వి.కే. కృష్ణ మీనన్ వీటి రూపకర్త.దేశంలో 33 స్కూళ్ళు ఉన్నాయి.రక్షణ సేవలో నాయకులను తయారు చేయడానికి విద్యార్థులను సన్నద్దులను చేయడం వీటి ప్రధాన లక్ష్యం.
14. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళు(APMREIS): ఇందులో 75శాతం సీట్లు ముస్లిం మైనారిటిలకుమిగతా 25శాతం BPL కుటుంబాల పిల్లలకు కేటాయిస్తారు. వీటిలో 12 వ తరగతి వరకు కూడా అవకాశం ఉంది.
15. ఎయిడెడ్ స్కూళ్ళు: ప్రభుత్వ ఆర్ధిక సహాయం పొందుతూ ప్రైవేట్ యాజమాన్యంలో నడిచే స్కూళ్ళు.
16. అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ళు: పూర్తిగా ప్రైవేట్ యాజమాన్యంలో నడిచే స్కూళ్ళు. ఇందులో బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్ళు,కార్పోరేట్ స్కూళ్ళు,చారిటి సంస్థల అధ్వర్యంలో నడిచే స్కూళ్ళు ఉంటాయి.
17. ఇంటర్నేషనల్ స్కూళ్ళు: ఐ.బి. లాంటి అంతర్జాతీయ కరికులంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నడిచే డే స్కూళ్ళు.
18. బోర్డింగ్ స్కూళ్ళు: ఐ.బి. లాంటి అంతర్జాతీయ కరికులంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నడిచే రెసిడెన్షియల్ స్కూళ్ళు.